Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి సమావేశం

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
రాబోయే మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో ఎస్ఐ నరెందర్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. పండుగను సోదరభావం, మత సామరస్యం, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మత పెద్దలకు సూచించారు.

అలాగే ఎవరైనా కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, ఇతరులను రెచ్చగొట్టేలా వ్యవహరించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -