Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొన్న పెద్ద గుల్లా సర్పంచ్

ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొన్న పెద్ద గుల్లా సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గురువారం పెద్దగుల్లలో నిర్వహిస్తున్న సర్వేలో ఆ గ్రామ సర్పంచ్ పాల్గొన్నారని కార్యదర్శి చందు తెలిపారు. ఈ సందర్బంగా కార్యదర్శి మాట్లాడుతూ.. ఉదయం నుంచే ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారని చెప్పారు. ఓటర్ ఫారాలను పూర్తి చేసిన వారు ఆన్ లైన్ చేసుకోవాలని సూచించారని అన్నారు. ఉపాధి నిమిత్తం ఇతర పట్టణాలకు వెళ్ళిన ఓటర్లు బీఎల్ఓలకు, కార్యదర్శులకు చరవాణిలో అందుబాటులో ఉండి ఆన్ లైన్ నమోదుకు సహకరించాలని కోరినట్టు పేర్కొన్నారు. సర్ ప్రక్రియ నిర్ధష్టంగా, వేగంగా పూర్తయ్యేందుకు హెల్ప్ లైన్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకోవాలని సూచించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి, బిఎల్ఓ, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -