అది
సభో! సంబరమో!
పెళ్ళో!... చావో!
పుట్టలుపుట్టలుగా జనం...
చెవులకు విశ్రాంతి ఉండదు.
ప్రతి రూపాయిని
వేటాడే ఆటలో అలుపే ఉండదు.
ఈ వారసత్వ మోతలో
రాను రాను
సంతోషాల పరుగు పందెంలో
గాయాలే ఆనందాలు....
పారేసుకుని పోగేసుకోవడం
బోర్లపడి బాధ్యతనుకోవడం
కాని వాటి కోసం కన్నీళ్ళుపెట్టుకోవడం సంప్రదాయంగా
బతుకు తొలి అల్లికే
నిజాలను తప్పుకుని
అల్లుకోవటమే గొప్ప సంతోషంగా
ఎన్నో పేర్లతో
పాటించే తీపి గాయాలకు
గర్వపడే విచిత్ర విషాదమే
మన ఘనత.
చందలూరి నారాయణరావు, 9704437247






కామెంట్లు (0)