- Advertisement -
నవతెలం-గాణ-హైదరబాద్: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్‌లలో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండటంతో కొండపై రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. నిన్న (శనివారం) 84,873 మంది స్వామి వారిని దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.3.67 కోట్ల కానుకలు లభించినట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -



