Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాకళల్ని ప్రోత్సహించాలి

ప్రజాకళల్ని ప్రోత్సహించాలి

- Advertisement -


ప్రజానాట్యమండలి 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ
యాదాద్రిలో గాయని జానకి,నాగన్నల సంస్మరణ సభ
నవతెలంగాణ-భువనగిరి

​ప్రజా కళల్ని ప్రోత్సహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రముఖ గాయని జానకి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ట నరసింహ మాట్లాడుతూ.. గాయని జానకి వేలాది పాటలు పాడి గొప్ప గాయనిగా గుర్తింపు పొందారని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలతో ఉన్న జానకికి అనేక అవార్డులు వచ్చినా వాటికి తిరస్కరించారన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం నిరంతరం కృషి చేసిన గాన కోకిల జానకి అని అన్నారు. ఐఎఫ్‌‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ.. అరుణోదయ నాగన్న అభ్యుదయ ఆలోచనతో తన పాటలతో ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలకపాత్ర వహించారన్నారు. ఐక్య సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులందరం ఏకతాటి పైకి రావడం ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో ఒకే వేదిక మీద ఉండి మతోన్మాద భావజాలాన్ని పాట రూపంలో వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, రాష్ట్ర కమిటీ సభ్యులు దేశపాక రవి, గంటేపాక శ్రీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గుండు నరసింహ, తెలంగాణ సాహితి జిల్లా కార్యదర్శి జిట్ట భాస్కర్ రెడ్డి , రచయిత కళ్యాణి, అరుణోదయ జిల్లా బాధ్యులు ఆర్ ఉదయ్, భాస్కర్ నాయక్, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేశం, పిఎన్ఎం నాయకులు బర్రె మధు, మద్దూరు సాయి, శివగళ్ల సంపత్, గుర్రం నరసింహులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -