Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో నేటి (ఆగస్టు 21) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -