Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు

- Advertisement -


నవతెలంగాణ – హైదరాబాద్ :
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక అల్లాడిన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. నైరుతి రుతుపవనాల కదిలికలతో ఏపీ, తెలంగాణలో మేఘావృతమై మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాలు నిలకడగా కొనసాగుతూ, దక్షిణ కోస్తాలో చల్లటి గాలులు వీస్తున్నాయి. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల పిడుగుల ప్రమాదంపై అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -