- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు కొనసాగనున్నట్లు వాతావరణ శాక వెల్లడించింది. జులై 7 నుంచి 13 వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఏపీలోని ఉత్తర కోస్తాలో జులై 12-13 మధ్య వర్ష సూచన ఉండగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వారంరోజుల పాటు వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
- Advertisement -


