- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రేపు రాఖీ పండుగ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఖీ అంటే రక్త సంబంధమని, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని ఆమె హితవు పలికారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాఖీ పండుగ ప్రస్తావన రాగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. “ఈసారి కేటీఆర్‌కు రాఖీ కడతారా?” అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “పోయినసారి అడిగితే ఆయన ఊర్లో లేకుండా పారిపోయారు. ఈసారి అడగకుండానే ఏకంగా విదేశాలకు వెళ్లిపోయారు. ఆడబిడ్డలమైన మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా? మా ఆత్మగౌరవం చాలా తీవ్రంగా దెబ్బతింది” అని ఆవేదనతో అన్నారు.
- Advertisement -



