నవతెలంగాణ-హైదరాబాద్: అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. పూర్తి ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌గా ఉన్న ఈ పాట లిరికల్ వీడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. గాయకులు ధనుంజయ్ సీపాన, సాహితి చాగంటి తమ గాత్రం అందించారు. చంద్రమోహన్ చింతడా రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టైటిల్ సాంగ్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



