Magazines

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బీజేపీ

5 రోజుల క్రితం

BJP in a precarious
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

దాని అస‌లు రూపం విదేశీ నినాదం : పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్

న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడ‌ల్లా విదేశీ నినాదం ఎత్తుకోవ‌టం బీజేపీకి ఆన‌వాయితీగా మారింద‌ని పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు. గ‌త ప‌ద‌మూడేండ్లుగా ఇదే తంతు న‌డుస్తోంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే ర‌కంగా బంగ్లాదేశ్ గురించి ఆ పార్టీ మాట్లాడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. శ‌నివారం హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మెన్ మధు యాష్కీ లతో కలిసి మ‌హేశ్ కుమార్ గౌడ్ మీడియా ప్ర‌తినిధుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 13 ఏండ్ల మోడీ పాల‌న‌లో దేశంలోని ఏ ఒక్క త‌ర‌గ‌తికీ న్యాయం జ‌ర‌గ‌లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిత్యం దేశ‌భ‌క్తి గురించి మాట్లాడే బీజేపీ పెద్ద‌లు... భార‌త భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చినా ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను నియ‌మించేందుకు కేంద్రం ఏకంగా కొలీజియాన్నే మార్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక్కో రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను నీరుగారుస్తోన్న మోడీ స‌ర్కారు, ఎన్నిక‌ల సంఘాన్ని అడ్డం పెట్టుకుని దేశంలోని మైనారిటీలు, గిరిజ‌నులు, లౌకిక‌వాదుల ఓట్ల‌ను తొల‌గిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


ఒక్క తెలంగాణలోనే 27 శాతం ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. ఈ ర‌కంగానే మ‌హారాష్ట్రలో గెలిచార‌ని, అక్క‌డ కేవ‌లం మూడు నెలల వ్యవధిలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్ల ఫలితాల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పు ఎందుకొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. ప‌శ్చిమ బెంగాల్‌, బీహార్‌ల‌లో కూడా ఇదే జ‌రిగింద‌న్నారు. దేశంలో తాము శాశ్వ‌తంగా అధికారంలో ఉండాల‌ని మోడీ, అమిత్ షా క‌ల‌లుగంటున్నార‌ని ఎద్దేవా చేశారు. తాము స‌ర్ ద్వారానే గెలిచామంటూ కేర‌ళం మంత్రి ర‌మేశ్ చెన్నిత‌ల ఎప్పుడూ అన‌లేద‌ని, ఆయ‌న మాట‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్దతివ్వాలంటూ ఇండియా బ్లాక్‌‌లోని భాగ‌స్వామ్య ప‌క్షాల‌న్నింటితో మాట్లాడుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వీలైనంత త‌ర్వ‌లో నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని, అయితే అది ద‌స‌రాలోపు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్