చైర్మెన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మెన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారుడు కె రామకృష్ణారావును నియమించారు. దీనికి కన్వీనర్‌గా ప్రణాళిక శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఎల్‌నినో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి పలు ఆదేశాలతోపాటు సూచనలు, సలహాలనిస్తుంది.







కామెంట్‌లు (0)