ప్రత్యేక అతిధిగా ఎఫ్దీసీ మాజీ చైర్మెన్ అనిల్ కూర్మాచలం
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి రెండు వేల మందికిపైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పార్లమెంట్ సభ్యురాలు రూత్ క్యాడ్బరీ, మాజీ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ, హౌన్స్లో మేయర్ రణ్జిత్ గిల్ ,హౌన్స్లో కౌన్సిల్ నాయకుడు శాంతను రాజావత్, ప్రత్యేక అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ నాయకుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ హాజరయ్యారు.
ప్రతి సంవత్సరం లాగే వేడుకలను చేనేత బతుకమ్మ మరియు దసరా జరుపుకున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. బతుకమ్మకు హాజరైన ముఖ్య అతిధులు మాట్లాడుతూ యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. ఎఫ్డీసీ మాజీ చైర్మెన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఈ వేడుకలకు టాక్ సంస్థ కార్యకర్తగా మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పం తో పాల్గొనడం జరిగిందన్నారు. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున రెడ్డి తెలిపారు.







కామెంట్లు (0)