Magazines

ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి

1 గంట క్రితం

and retirement benefits should be provided.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

సివిల్ సప్లై, జీసీసీ హమాలీ కార్మికుల విజయోత్సవ సభలో పాలడుగు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లై, జీసీసీ హమాలీ కార్మికులకు ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సివిల్ సప్లై, జీసీసీ హమాలీ కార్మికులు పోరాడి వేతన రేట్లను పెంచుకున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌‌ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కార్మికులు విజయోత్సవ సభను నిర్వహిం చారు.యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. బాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో భాస్కర్‌ ‌మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సివిల్ సప్లై, జీసీసీ విభాగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల శ్రమను ప్రభుత్వాలు వినియోగిం చుకుంటున్నప్పటికీ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెరగడం లేదని చెప్పారు. దీంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఒకే ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల మధ్య వివక్ష చూపకూడదని సూచించారు. సివిల్ సప్లై కార్మికులకు వర్తించే ప్రయోజనాలను జీసీసీ కార్మికులకు కూడా కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సదు పాయాలు అమలు చేయాలని కోరారు. కార్మి కులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, తగిన వేతనాలు, పే స్కేలు, పీఆర్సీ, రిటైర్‌‌ మెంట్ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన కార్మికులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులతో జీవించాల్సిన పరిస్థితి రాకూడదని, రిటైర్‌‌ మెంట్‌ సమయం లో ఆర్థిక ప్రయోజనాలు, పెన్షన్ సదుపాయాలు కల్పిం చాలని ‌విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరిగి నప్పుడు కార్మికులకు, వారి కుటుం బాలకు తగిన పరిహారం, వైద్య బీమా అందిం చాలని కోరారు. ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరే షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లా డుతూ హమాలీలను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న హైదరాబాద్‌‌ లో నిర్వహిం చనున్న మహా ధర్నాలో రాష్ట్రవ్యా ప్తంగా హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుస్సా మొగిలి, హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సుధాకర్, రాష్ట్ర కార్యదర్శులు యాటల సోమన్న, రాపర్తి రాజు, వి.వి. నర్సింహ, వీరాస్వామి, నాయకులు శివ, వీరయ్య, శ్రీనివాస్, హనుమయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్