Magazines

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

56 నిమిషాల క్రితం

KCR extends Dasara greeting
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ‌బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌‌రావు (కేసీఆర్) దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో, సాంప్రదాయ వేడుకల్లో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉన్నదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానిదే చివరి విజయమనే విజయ దశమి స్ఫూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలోనూ, అనంతర పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు. భవిష్యత్తులోనూ దసరా స్ఫూర్తితో ప్రజలు అధర్మం మీద విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను అన్ని రంగాల్లో విజేతలుగా నిలబెట్టడం ద్వారానే దసరా పండుగ స్ఫూర్తిని అమలు పరిచిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కష్టాలను తొలగించి, తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగ, శుభాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్