Magazines

వడ్డీతో సహా బకాయిలు చెల్లించండి

53 నిమిషాల క్రితం

Pay the dues including interest.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

రిటైర్డ్‌ ఉద్యోగుల ధర్నా ‘చలో సచివాలయం’ ఉద్రిక్తం..
ప్రాంగణంలో బైటాయింపు, అరెస్ట్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

బకాయిలు చెల్లించాలంటూ రిటైర్డ్‌ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌‌లో చేపట్టిన ‘చలో సచివాలయం’ ఉద్రిక్తమైంది. వందలాదిగా ఉద్యోగులు సచివాలయం ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. రెండున్నరేండ్లయినా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తమ బకాయిలను చెల్లించకపోవడం దారుణమని నిరసించారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయ ప్రాంగణంలో బైటాయించారు. ఉద్యోగ విరమణ చేసి సంతోషంగా ఇంటి దగ్గర ఉండాల్సిన మమ్మల్నీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌‌రెడ్డి, తమ బకాయిలను చెల్లించకుండా వేధిస్తున్నారని విమర్శించారు. బకాయిల కోసం ఎదురుచూసి పలువురు రిటైర్డ్‌ ఉద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బకాయిలు బ్యాంకులో వేసుకున్నా, జీపీఎఫ్‌లో ‌జమచేసుకున్నా ఎనిమిది శాతం వడ్డీ వచ్చేదని తెలిపారు. ప్రభుత్వం తమ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. చేతకాని వయస్సులో రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించందని ఆందోళన వ్యక్తంచేశారు. చనిపోయిన వాళ్లకు ఎక్స్‌‌గ్రేషియా కూడా ఇంత వరకు అందలేదని ఆరోపించారు. ప్రతినెలా మా డబ్బులు మాకిస్తే, ఈ ధర్నా చేయాల్సి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. మర్యాదగా మా డబ్బులు మాకివ్వు..లేకపోతే నీ కుర్చీ కదులుతుందని హెచ్ఛరించారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు నిర్భందించే ప్రయత్నం చేశారు. ఇటు రిటైర్డ్‌ ఉద్యోగులు, అటు పోలీసుల మద్య తోపులాట చోటుచేసుకుంది. సచివాలయ ప్రాంగనానికి వచ్చిరావడంతోనే వారిని పోలీసులు అరెస్ట్‌ ‌చేశారు. దీంతో ఉద్రికత్త చోటుచేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్