నవతెలంగాణ-హైదరాబాద్
దాంపత్య జీవితంలో చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలను క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గత తీర్పులు, కేసులోని వాస్తవాల ఆధారంగా క్రూరత్వాన్ని నిర్ధారించాల్సి ఉంటుందని పేర్కొంది. 2009లో వివాహం చేసుకున్న హైదరాబాద్ దంపతులకు ఆ తర్వాత ఏడాదిలో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. భార్య వేధింపులకు పాల్పడుతోందంటూ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేసింది, దాంపత్య హక్కుల పునరుద్ధరణకు భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. ఈ తీర్పులను సవాలు చేస్తూ భర్త దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుజనలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. భార్య మానసిక సమస్యతో బాధపడుతోందని, ఇల్లరికం రావాలని ఆమె, అత్తమామలు ఒత్తిడి చేశారని భర్త చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. గృహహింస కేసు దాఖలు చేయడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని తెలిపింది. దంపతులు 14 ఏళ్లుగా విడిగా ఉంటున్నప్పటికీ, స్వల్ప కారణాలతో విడాకులు మంజూరు చేయలేమంది.
చిన్న గొడవలతో విడాకులు ఇవ్వలేం
57 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)