- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు గత రెండు వారాలతో పోలిస్తే తగ్గాయి. కేజీ చికెన్ ధర ఇటీవల రూ.300-330 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.250-280 మధ్య లభిస్తోంది. గుడ్ల రిటైల్ ధర కూడా ఒక్కోటి రూ.8-9 నుంచి రూ.6-7కు పడిపోయింది. స్కిన్‌లెస్ చికెన్ ధర తెలంగాణలో వరంగల్‌లో రూ.250, హైదరాబాద్, కామారెడ్డిలో రూ.270, నిజామాబాద్, ఖమ్మంలో రూ.280గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కడప, మార్కాపురంలో రూ.260, గుంటూరులో రూ.280గా విక్రయిస్తున్నారు. ధరలు తగ్గడంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది.
- Advertisement -



