Thursday, July 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐదు భారతీయ భాషల్లో రిలీజ్

ఐదు భారతీయ భాషల్లో రిలీజ్

- Advertisement -

నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న సినిమా ‘రామాయణ: పార్ట్ 1’.
దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సృష్టి ఆరంభం నుంచి త్రిమూర్తులు మూడు లోకాలను పాలిస్తున్నారు. సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణు, పరివర్తనకు ప్రతీక అయిన శివుడు విశ్వాన్ని నడిపిస్తుంటారు. స్వర్గం, భూమి అశాంతి వైపు సాగుతున్న సమయంలో సమతుల్యతను పునరుద్ధరించేందుకు విష్ణుమూర్తి అవతారమెత్తి భూమిపైకి దిగివస్తాడు. ఇందులో శ్రీరాముడు (రణ్‌బీర్ కపూర్)గా జన్మిస్తాడు. మరోవైపు త్రిమూర్తుల వరాలతో అజేయుడు, అమరుడు, అపార జ్ఞానవంతుడు, అత్యంత శక్తిమంతుడైన రాక్షసరాజు రావణుడు (యశ్) అహంకారం, ప్రతీకారంతో విశ్వాన్నే కుదిపేసే శక్తిగా నిలుస్తాడు. రావణుడిని ఎదుర్కొనేందుకు విధి నిర్ణయించిన వ్యక్తి తానేనని తెలియని శ్రీరాముడు, ధర్మానికి ప్రతీకగా, అయోధ్య యువరాజుగా అందరి ప్రేమాభిమానాలను పొందుతాడు. తన ప్రియమైన భార్య సీత (సాయి పల్లవి), నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడు (రవీ దూబే)తో ప్రశాంతమైన జీవితం గడపాలని భావిస్తాడు. అయితే విధి అతన్ని వనవాసానికి నడిపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఆద్యంతం ఆసక్తికరం, అందరినీ సమ్మోన పరిచే విధంగా ఈ సినిమా ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -