నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో రెండో వార్డులో ప్రభుత్వ స్థలాన్ని, వెంచర్ రోడ్డును మిగిలిన స్థలాన్ని బోరును కబ్జా చేసిన వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆలేరు పట్టణంలో బిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్రావుకు వినతిపత్రం అందజేశారు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు ప్రజలకు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన నాయకులు, ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అధికారం ఉన్నదని, అహంకారంతో ఆక్రమణలకు పాల్పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత మానవ హక్కుల సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రెటరీ మంగ నరసింహులు, మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, బీజన్ మధు కుమార్, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, మాజీ జిల్లా ఆర్టిఏ నెంబర్ పంతం కృష్ణ ,యువజన నాయకులు పూల శ్రావణ్, జల్లి నరసింహులు, కుతాటి అంజన్ కుమార్, సీస సత్తయ్య గౌడ్,మోతే వెంకటేష్, ఫయాజ్ ,ఎలుగల హరికృష్ణ,చంద్రశేఖర్ పాల్గొన్నారు.



