భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఇప్పటికే భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఓ ఫ్రెష్ లవ్ స్టోరీతో ‘రోమాంచకం’ సినిమా రానుంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 3న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్స్ తో , వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్ తో సాగుతూ హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. ఈ సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు వస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తోంది. ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డీవోపీ – పవన్ పప్పుల, మ్యూజిక్ – వాసుకి వైభవ్, రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి.
‘రోమాంచకం’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



