- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని రుద్రారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పాటు గ్రామ సర్పంచ్ రవి ఉపసర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి సామూహిక భోజనం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది అని వారు అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల మౌలిక సదుపాయాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



