నవతెలంగాణ-ఆర్మూర్
బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుదురుపాక ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ..18వ శతాబ్దం ప్రారంభంలో తెలంగాణ ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ స్థానిక జమీందారుల పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని అన్నారు. బహుజన సమాజం కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పోడేటి శంకర్, న్యాయవాదులు కృష్ణ పండిత్,ఆవారి రమేష్,షిండే,కృష్ణంరాజు,ఐనరి అశోక్,బాబా గౌడ్,చంద్ర ప్రకాష్,మోహన్ నాయక్,నందిన్ తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



