Magazines

‘418’కి విశేష ప్రేక్ష‍కాదరణ

57 నిమిషాల క్రితం

418 movie
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ‘418’. ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, ‘సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్నటి కంటే ఈరోజు చాలా బాగుంది. మేము చేసిన ఫస్ట్ హర్రర్‌ సినిమా ఇది. మా బ్యానర్‌కు ఇంత మంచి సినిమా చేసి పెట్టిన డైరెక్టర్ కీర్తన్‌కు థాంక్యూ. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ సినిమా మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. ‘కీర్తన్ ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ రాసి, సినిమాను అద్భుతంగా చేశాడు.

సౌండ్ డిజైన్, మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా బాగుందని అందరూ అంటున్నారు. ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్‌గా ఫుల్ అయ్యాయి. సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీలో మరో విభిన్నమైన సినిమా చేశామని తృప్తిగా ఉంది. మంచి సౌండ్ ఉన్న థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి. ఇది నెక్స్ట్ లెవల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని నిర్మాత రవిశంకర్ చెప్పారు. మైత్రీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ మధ్యకాలంలో తెలుగులో ఇలాంటి హర్రర్‌ సినిమా నేను చూడలేదు. డాల్బీలో చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’ అని అన్నారు. ‘సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిర్మాతలు నవీన్, రవి, ప్రశాంత్ నీల్ చాలా ప్రోత్సహించారు. ప్రేక్షకులు థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నారు’ అని డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్