యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. అందరి జీవితాల్లోనూ పండగ నింపాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గత ఐదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు వైస్ చైర్పర్సన్ సీఎస్ఆర్ అపోలో హాస్పిటల్స్ ఉపాసన కామినేని కొణిదెల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ,‘సుమని చూసినప్పుడు నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల, విజయాలు అభినందనీయం.
ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ను ప్రారంభించి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. ‘మా కార్యక్రమాలకు ఎన్నోసార్లు యాంక రింగ్ చేసిన సుమ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదు. ఇతరులకు ఇవ్వాలనే కృతజ్ఞతాభావం, సేవా దృక్పథం ఆమెకు ఉన్నాయి’ అని సునీత కృష్ణ చెప్పారు.
సుమ కనకాల మాట్లాడుతూ, ‘మా దాతలకు, లబ్ధి దారులకు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం. జీవితం ఒక పాఠశాల లాంటిది. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఉపాసన, సునీత కృష్ణ చేస్తున్న సేవలు మాకు గొప్ప స్ఫూర్తినిస్తాయి. మేము ఐదేళ్లలో చేసిన సేవలకంటే వంద రెట్లు ఎక్కువగా వీరు సమాజానికి సేవ చేస్తున్నారు’ అని అన్నారు.
ఘనంగా ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ 5వ వార్షికోత్సవ వేడుక
56 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)