Magazines

సరికొత్త గ్యాంగ్‌స్టర్‌ సిరీస్‌

51 నిమిషాల క్రితం

series
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

అధికారం, వారసత్వం, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన గ్యాంగ్‌స్టర్ కథా సిరీస్ ‘అక్క’ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వైఆర్‌ఎఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. మహిళలే అధికారాన్ని శాసిస్తూ, తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడే ఒక విభిన్నమైన ప్రపంచాన్ని ఈ సిరీస్ ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ ఈనెల 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. విధేయతతో నిర్మించబడిన ఒక సామ్రాజ్యం.. తర తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక వారసత్వం.. వీటన్నింటినీ నాశనం చేసే ప్రమాదం ఉన్న ఒక తీవ్రమైన ప్రత్యర్థిత్వం.. ఇదే ఈ సిరీస్‌ ఇతివృత్తం. ఈ కథలో భవాని (కీర్తి సురేష్), రుద్ర (రాధికా ఆప్టే) ప్రధాన పాత్రలు. విభిన్నమైన ఆశయాలు, నమ్మకాలు కలిగిన ఈ ఇద్దరు శక్తివంతమైన మహిళల మధ్య ఏర్పడే పోరాటమే కథకు కేంద్రబిందువు. వీరి మధ్య సంఘర్షణ అక్కడి వ్యవస్థను కుదిపేసే స్థాయికి చేరుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సిరీస్ హెడ్ తన్యా బామి మాట్లాడుతూ, ‘ఈ సిరీస్‌తో ప్రేక్ష‍కులు పెర్నూరు అనే కల్పిత ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఇక్కడ మహిళలు కేవలం కథలో భాగం మాత్రమే కాదు.. వారే అధికారానికి కేంద్రబిందువు’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్