Magazines

తెలుగులో ‘ప్రతిరూపం’గా..

1 గంట క్రితం

counterpart
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

శ్రీ వినాయక వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఎస్. నరేష్ దర్శకత్వంలో బి. కళావతి కన్నడలో నిర్మించిన చిత్రం ‘ఇనియన్ ఆత్మ’. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రతిరూపం’ పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రి-రిలీజ్ వేడుకకు నటీమణి కె.దివ్యవాణి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టి. రామసత్యనారాయణ, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గిడుగు కాంతికృష్ణ, బిజినెస్ కో-ఆర్డినేటర్ నారా యణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత బి. కళావతి, చిత్ర దర్శకుడు నరేష్, ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బి.సుస్మిత, "రేణుక-ఎల్లమ్మ" సీరియల్ ఫేమ్ అనన్య వి.ఎస్., నయన, మధుశ్రీ, మంత్రవాది ఆది, రవి కిరణ్, కిట్టు ఈ వేడుకలో పాల్గొని తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. కన్నడ సినిమా రంగంతో తనకున్న ప్రత్యేక అను బంధాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందంతో కన్నడలో అనర్గళంగా మాట్లాడిన దివ్యవాణిఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథులు టి. రామసత్య నారాయణ, గిడుగు కాంతి కృష్ణ మాట్లాడుతూ, ‘తెలుగు ప్రేక్షకులకు భాషా భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే బ్రహ్మ రథం పడతారు’ అని తెలిపారు. త్వరలో తెలుగులో స్ట్రెయిట్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బి.కళావతి ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్