సుచిత్, అదితి త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫీల్ గుడ్’. విశ్వరూప ఫిల్మ్స్ బ్యానర్‌పై దయానంద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సుచిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట ఆకట్టుకునే సంగీతం, మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరిస్తోంది. యువతను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘వైబ్’, ‘సింక్’, ‘ట్రెండ్’, ‘హైప్’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్ ఎనర్జీ కనిపి స్తుంది. లవ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సా హాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. శాండిల్య పిసపాటి అందించిన మ్యూజిక్, కడలి సత్యనారాయణ సాహిత్యం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి పాడిన ఈ పాట నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఫీల్ గుడ్‌గా రూపొందింది అని చిత్ర యూనిట్ తెలిపింది. రవూరి ప్రియాంక, లిఖిత్, రణధీర్ వాసుదేవ్, సైఫాని, దివ్య మోహన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దయానంద్, నిర్మాత: సుచిత్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మహికాంత్, ఎడిటర్: దయానంద్, ఆర్ట్ డైరెక్టర్: రాంగోపాల్ రెడ్డి.







కామెంట్‌లు (0)