Magazines

‘మదరాసి రబ్బరు బొమ్మ..’పాట సందడి మొదలైంది

1 గంట క్రితం

Madrasi
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మునుపెన్నడూ చూడని మాస్ మేకోవర్‌తో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌. ఇప్పటికే విడుదలైన టైటిల్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ఎనర్జిటిక్‌గా ప్రారంభిస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఇన్ఫెక్షియస్ రిథమ్స్, ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్, ఇన్‌స్టంట్ మాస్ అప్పీల్‌తో ఆకట్టుకునే ఫోక్ నంబర్‌గా నిలిచింది. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఫోక్ కంపోజిషన్స్, మాస్ నంబర్స్ అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో.. ఆకట్టుకునేలా ఈ ఫోక్ బ్యాంగర్‌ను రూపొందించారు.

డైనమిక్ ఇన్‌స్ట్రు మెంటేషన్, ఉర్రూతలూగించే మ్యూజిక్ అరేంజ్‌మెంట్స్, హై ఎనర్జీ కంపోజిషన్ ఈ పాటకు అదిరిపోయే సెలబ్రేషన్ వైబ్‌ను తీసుకొచ్చాయి. సురేష్ గంగుల అందించిన లిరిక్స్ పాటకు ఎంటర్‌టైనింగ్ మాస్ ఫ్లేవర్‌ను జోడించాయి. హీరో, హీరోయిన్ మధ్య సరదాగా సాగే రొమాంటిక్ సంభాషణలను తన పదాలతో అందంగా ఆవిష్కరిం చారు. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ తమ పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటకు అద్భుతమైన ఎనర్జీని అందించారు. పాట విజువల్స్ కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ఆకట్టుకునే ఫోక్ ఇన్‌స్పైర్డ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించారు. సాయి శ్రీనివాస్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకోగా, నేహా శెట్టి కూడా ఆకట్టుకునే స్టెప్పులేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మంచి విజువల్ ట్రీట్‌గా మార్చాయి. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీ ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్