Thursday, August 20, 2026
E-PAPER
Homeఖమ్మంనిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి 

నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి 

- Advertisement -

– నేడు ఖమ్మం మహా ధర్నాను జయప్రదం చేయండి
– సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
: నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు (గురువారం) ఖమ్మంలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు కోరారు. ​ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని సర్వేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ​నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా విడుదల చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ​ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ​సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఖమ్మం ధర్నాలో పాల్గొనాలని కోరారు. ​యువత ఏకమై తమ హక్కుల కోసం ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.​ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ​నిరుద్యోగులంతా కలిసికట్టుగా హాజరై ఈ మహాధర్నాను ఘనంగా విజయవంతం చేయాలని సర్వేశ్వరరావు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -