మనకు సౌకర్యవంతమైన సమయంలో ఇంట్లోనే చేసుకునే వ్యాయామాలలో సూర్యనమస్కారాలను కూడా చెప్పుకోవచ్చు. అయితే వీటిని పొద్దున్నే లేవగానా చేయాలనే నియమం ఏమీ లేదు. ఆహారం తిన్న తర్వాత రెండు గంటలు గ్యాప్తో చెయ్యవచ్చు. ప్రారంభంలో వీటిని చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. మొదట 30 సూర్య నమస్కారాలతో మొదలు పెట్టి నెమ్మదిగా సంఖ్య పెంచుకోవచ్చు. మొత్తం108 సూర్య నమస్కారాలు చెయవచ్చు.
ప్రయోజనాలు
పీసీఓడీ: ప్రస్తుతం అమ్మాయిలు ఎదుర్కొంటున్న పీసీఓడీ సమస్యకు సూర్యనమస్కారాలు ఓ చక్కని పరిష్కారంగా చెప్పుకోవచ్చు. అలాగే గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి కూడా ఇవి బాగా పని చేస్తాయి.
హార్మోన్ల సమతుల్యత: మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, థైరాయిడ్ వంటి సమస్యలను అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది.
బరువు తగ్గడం, ఊబకాయం నివారణ: సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో వేగంగా క్యాలరీలు బర్న్ అవుతాయి. ఒక సెట్ సూర్య నమస్కారం చేయడం వల్ల సుమారు 13.90 క్యాలరీలు ఖర్చవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి
శరీర వశ్యత (Flexibility), బలం: ఇందులోని వివిధ భంగిమలు వెన్నెముక, మెడ, చేతులు, కాళ్ళు, పొత్తికడుపు కండరాలను సాగదీసి, వాటిని దృఢంగా మారుస్తాయి.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: శ్వాస నియంత్రణతో కూడిన ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా అందుతుంది.
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది: పొత్తికడుపు కండరాలు సాగడం, ముడుచుకోవడం వల్ల అంతర్గత అవయవాలకు మర్దన జరిగి, జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం: రక్త ప్రసరణ పెరగడం, శరీరం నుండి టాక్సిన్స్ (వ్యర్థాలు) బయటకు పోవడం వల్ల ముఖంలో సహజమైన గ్లో పెరుగుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒత్తిడి, ఆందోళనల నివారణ: క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడి, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుదల: విద్యార్థులు, ఉద్యోగులు దీనిని రోజూ చేయడం వల్ల మెదడు చురుగ్గా మారి ఏకాగ్రత, దృష్టి, ఓర్పు పెరుగుతాయి.
నిద్రలేమి సమస్యకు చెక్: మానసిక ప్రశాంతత లభించడం ద్వారా రాత్రి పూట హాయిగా, ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: సాధారణ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి రోగనిరోధక శక్తిని ఇది బలోపేతం చేస్తుంది.
గుండె ఆరోగ్యం: ఇది ఒక మంచి కార్డియో వ్యాయామంలా పనిచేసి గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
సూచన: మీరు సూర్య నమస్కారాలను మొదటిసారిగా ప్రారంభిస్తుంటే, ఏవైనా ఆరోగ్య సమస్యలు (కీళ్ల నొప్పులు, బీపీ వంటివి) ఉంటే వైద్యుని సలహాతో ఈ వ్యాయామాలు ప్రారంభించాలి.
వాణీ అయోధ్య
క్లినికల్ డైట్ కన్సల్టంట్
99593 61180
సూర్య నమస్కారాలు - ప్రయోజనాలు
26 సెప్టెంబర్, 2026

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)