శబ్దమయ ప్రపంచంలో
ఒక రోజు
నీ కోసం
ఒక ఉదయ కిరణం
నీ పక్కన వచ్చి కూర్చుంటుంది
అది నిన్ను ఏమి అడగదు
సోయగాల లోకం
ఒక నిత్యలోలకమని
దానికి తెలుసు
ఇసుక గడియారంలా
వాలిపోతున్న కాలంలోనూ
నీ కోసం నీ ఇంటిదాకా వస్తుంది
ఎలాంటి చప్పుడు చేయదు
నీ వదనాన్ని
అలా చూస్తుండి పోతుంది
లేతగాలిలా నీ హృదయాన్ని
నిమిరిపోతుంది
నిన్ను ఏ కోరికా కోరదు
లోకమర్యాదలు
నిన్ను నిలువునా ముంచిన
సంగతలు కొత్తవి కావు
నీలో సుళ్ళు తిరుగున్నవి
నిన్ను విడిచిపెట్టవు
యంత్ర విరామం లో
ఒక మెలకువ ఈ జీవితం
ఈ పూట నీకోసం వచ్చిన
ఈ వెన్నెల కరిగిపోయేలోపు
దిగులు కిటికీ వైపు చూడకు
డా.సుంకర రమేశ్, 9492180764






కామెంట్లు (0)