అక్షరంతో స్నేహం చేస్తే
అంధకారంలోనూ దారి కనిపిస్తుంది,
పలకరించే ప్రతి అక్షరం
పదంగా మారి ప్రశ్నించడం నేర్పిస్తుంది.
పుస్తకం తెరిస్తే లోకం తెరుచుకుంటుంది,
పేజీ తిప్పితే కొత్త లోకం పరిచయమవుతుంది,
చదువు చేతిలో ఆయుధమైతే
అన్యాయాన్ని ఎదిరించే తెగువొస్తుంది.
అక్షరం మన ఆలోచనకు రెక్కలిస్తుంది,
ఆత్మవిశ్వాసానికి ఊపిరిపోస్తుంది,
ఎవరిముందూ తలవంచని నడకను
మనలో నింపుతుంది.
సంతకం చేయడమే కాకుండా
స్వంత నిర్ణయంతో నిలబడటమే ఆత్మగౌరవమని!
బతుకును బతకడమే కాకుండా
బతుకుకు అర్థం చెప్పేది అక్షరమే!
- సాధన. తేరాల






కామెంట్‌లు (0)