నేలకు నింగి గొడుగు
అడవికి ఆకుల గొడుగు
ఇంటికి కప్పు గొడుగు
నాకు నాన్న గొడుగు
నాన్నకు పొడుగు గొడుగు
అమ్మకు చెంగు గొడుగు
అన్నకు రంగు గొడుగు
అక్కకు బొమ్మల గొడుగు
అంగట్లో అందాల గొడుగు
వాకిట్లో వయ్యారి గొడుగు
వానల్లో నల్లటి గొడుగు
ఎండల్లో తెల్లటి గొడుగు
పూలపూల పసుపు గొడుగు
సోకుసోకుల ఎరుపు గొడుగు
గాలికి మాత్రం గిర్రున తిరుగు
ఎగిరిందంటే పరుగో పరుగు
- డా.హారిక చెరుకుపల్లి, 9000559913
గొడుగు
26 సెప్టెంబర్, 2026

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)