Wednesday, July 8, 2026
E-PAPER
Homeఆటలుస్పెయిన్‌ ముందంజ

స్పెయిన్‌ ముందంజ

- Advertisement -

0-1తో పోర్చుగల్‌ పరాజయం
చెదిరిన క్రిస్టియానో రొనాల్డో కల


డల్లాస్‌ (‌యుఎస్‌‌ఏ) : ఫిఫా ప్రపంచకప్‌‌లో మరో హార్ట్‌‌బ్రేక్‌. మాజీ చాంపియన్స్‌ బ్రెజిల్‌, జర్మనీ ఇప్పటికే ఇంటిముఖం పట్టగా.. తాజాగా అదే బాటలో పోర్చుగల్‌ ‌నడిచింది. ఫుట్‌‌బాల్‌ ‌దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్‌ ‌కలకు డల్లాస్‌‌లోనే తెరపడింది. 41 ఏండ్ల క్రిస్టియానో రొనాల్డోకు ఇదే కెరీర్‌ ఆఖరు ఫిఫా ప్రపంచకప్‌. దీంతో ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ ‌టైటిల్‌ ‌లేకుండానే దిగ్గజ ఆటగాడు కెరీర్‌ ‌ముగించనున్నాడు. మంగళవారం డల్లాస్‌‌ స్టేడియంలో జరిగిన ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లో స్పెయిన్‌, పోర్చుగల్‌ ఆఖరు వరకు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. 90 నిమిషాల ఆట వరకు ఇరు జట్లు గోల్‌ ‌కొట్టడంలో విఫలం అయ్యాయి. 84వ నిమిషంలో సబ్‌‌స్టిట్యూట్‌‌గా వచ్చిన మికెల్‌ ‌మెరినో 90+1వ నిమిషంలో అద్భుతం చేశాడు. పోర్చుగల్‌ ‌కోటను బద్దలుకొడుతూ, స్పెయిన్‌‌కు గోల్‌ ‌సాధించాడు. 1-0తో ఆధిక్యంలో నిలిచిన స్పెయిన్‌ ‌ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లో ఉత్కంఠ విజయం సాధించింది. పోర్చుగల్‌‌పై స్పెయిన్‌ ‌ముందు నుంచి ఆధిపత్యం చెలాయించింది. బంతి నియంత్రణ, పాస్‌ ‌కచ్చితత్వం, గోల్‌‌పోస్ట్‌‌పై దాడులతో స్పెయిన్‌ ‌దూకుడు చూపించింది. రొనాల్డోకు సహచరుల సహకారం లేకపోవటం, స్టార్‌ ఆటగాడిని కట్టడి చేస్తూ స్పెయిన్‌ మెరుపు విజయం ఖాతాలో వేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -