Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలోని కోర్టులకు ఈనెల 27న ప్రత్యేక సెలవు..

తెలంగాణలోని కోర్టులకు ఈనెల 27న ప్రత్యేక సెలవు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా, సబార్డినేట్, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు ఈ నెల 27న ప్రత్యేక సెలవు ప్రకటించారు. దీంతో పాటు 26వ తేదీ నాలుగో శనివారం, 28వ తేదీ ఆదివారం సెలవులు కలిసి వరుసగా మూడు రోజులు కోర్టులు మూతపడనున్నాయి. ఈ ప్రత్యేక సెలవునకు ప్రతిఫలంగా శనివారం హైకోర్టు యథావిధిగా పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు ఈ విషయాన్ని గమనించి తమ కేసుల విచారణ తేదీలను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -