Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ ఐ ఆర్ కార్యక్రమం విజయవంతానికి తాసిల్దార్ ప్రత్యేక చర్యలు

ఎస్ ఐ ఆర్ కార్యక్రమం విజయవంతానికి తాసిల్దార్ ప్రత్యేక చర్యలు

- Advertisement -

– గ్రామ ప్రజల నుండి విశేష స్పందన,
నవతెలంగాణ-మద్నూర్ : జుక్కల్ నియోజకవర్గం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ ఎస్ ఐ ఆర్ ఓటర్ సవరణ ప్రక్రియ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు మద్నూరు మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 100% ఓటర్ సవరణ ప్రక్రియ పూర్తికావడానికి తాసిల్దార్ రోజుకు ఒక వాడలో హెల్ప్ లైన్ కౌంటర్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారు. తాసిల్దార్ చేపడుతున్న చర్యలు పట్ల గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు ఎందుకంటే చాలా మందికి ఎస్ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియ ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ఫారాలు ఎలా నింపాలి అనే దానిపై తెలియని పరిస్థితి దానిని దృష్టిలో పెట్టుకొని తాసిల్దార్ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తూ గ్రామ ప్రజలకు ఎస్ఐఆర్ ఫారాల అందజేత వాటిని పూర్తి ఆన్లైన్ ద్వారా ఓటర్ల జాబితా నమోదు చేయడంలో తాసిల్దార్ కృషి ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది.  తాసిల్దార్ తో పాటు డిప్యూటీ తాసిల్దార్, ఆర్ ఐ మురళిదర్, రవికుమార్, కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -