నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం కొత్తూరులోని మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో టీజీడీఈసెట్ (టీజీ డీ.ఈఎల్.ఈడీ) 2026–28 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పొందేందుకు ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీఆర్ దీక్షితులు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో తెలుగు మాధ్యమంలో అర్హత సాధించి, ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఈ నెల 30న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ కళాశాలకు విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో నిర్దేశిత సమయానికి హాజరుకావాల్సిందిగా ప్రిన్సిపాల్ దీక్షితులు స్పష్టం చేశారు.



