Magazines

మోడీ హయాంలో వ్యవసాయ రంగం నిర్వీర్యం

3 గంటల క్రితం

Agricultural
avatar
balaji

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి : సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు డిమాండ్‌

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కార్మిక, కర్షక ఐక్యతా మానవహారం


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ పన్నెండేండ్ల పాలనలో దేశంలో వ్యవసాయ రంగం నిర్వీర్యమైందని సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరగనున్న అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ మహాసభల నేపథ్యంలో బుధవారం హైదరా బాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక, కర్షక ఐక్యతా మానవహారం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ ఖరీదైన భూములు, ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలకు బీజేపీ సర్కార్‌ అప్పనంగా కట్టబెడుతోందని విమర్శిం చారు. దేశంలోని140 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్న ఈ రంగాన్ని పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎఐకెఎస్ 36వ జాతీయ మహా సభల నిర్ణయాల అమలులో తెలంగాణ రాష్ట్ర కార్మికవర్గం రైతాంగ ఉద్య మాలకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ దేశంలో నెలకొన్న ఎల్‌‌నినో వాతావరణ మార్పులతో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించ డంతో పాటు సామాన్య ప్రజలకు ఉచితంగా సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు డాక్టర్ అరిబండి ప్రసాద్‌‌రావు మాట్లాడుతూ విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసేవరకు రైతాంగం సమరశీల పోరాటాలను సాగించా లన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కాగితాలకే పరిమితమైందనీ, ఆచరణలో పెట్టుబడిదారీ వ్యవసాయ విధానాలను అమలు జరుపుతూ కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి ద్రోహం చేస్తోందని విమర్శించారు.


సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభల నినాదాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 15న నల్లగొండలో జరగనున్న భారీ ప్రదర్శన, బహిరంగ సభలో కార్మికవర్గం ఆధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కోశాధికారి మూడ్ శోభన్ నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ఆర్. సుధాభాస్కర్, జె. మల్లికార్జున్, వీఎస్. రావు, పి. జయలక్ష్మి, కె. ఈశ్వర్రావు, కె. గోపాలస్వామి, రాష్ట్ర కార్యదర్యులు జె. వెంకటేష్, ఎం. పద్మశ్రీ, బి. మధు, కూరపాటి రమేష్, పి. శ్రీకాంత్, పి. సుధాకర్, బీరం మల్లేష్, ఎం. వెంకటేష్, రాగుల రమేష్, ఏ.ముత్యంరావు, కాసు మాధవి, బి.కవిత, సీహెచ్. భాను కిరణ్ పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్