Magazines

క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యంపై ఏఐసీసీ సీరియ‌స్

18 నిమిషాల క్రితం

AICC
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

డుమ్మాకొట్టిన నేత‌ల‌పై కాంగ్రెస్ పెద్ద‌ల ఆగ్ర‌హం

ఢిల్లీకి ఎవ‌రెవ‌రు రాలేదు? ఎందుకు రాలేదు...?

నివేదిక పంపాలంటూ సీఎం, పీసీసీ చీఫ్‌న‌కు ఆదేశాలు


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
ఓట్ చోరీపై ఇండియా బ్లాక్ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు డుమ్మా కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌పై ఆ పార్టీ అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రు కావ‌ట‌ మేంట‌ని ప్ర‌శ్నించింది. హైక‌మాండ్ ఆదేశా లంటే లెక్క‌లేక పోతే ఎలా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ అంశంపై వెంట‌నే స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను ఆదేశించింది. ఆ రిపోర్టు ఆధారంగా త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తామంటూ అధిష్టానం స్ప‌ష్టం చేసింద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ నెల ఒక‌టిన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వ‌హించిన భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌, బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున త‌ర‌లివెళ్లిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ చైర్మెన్లు, కాంగ్రెస్ నేత‌లు హ‌స్తిన‌కు బ‌య‌ల్దేరి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

త‌మ పార్టీ శ్రేణుల‌ను ఢిల్లీకి పంపేందుకు వీలుగా రైళ్లను కేటాయించాలంటూ టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎమ్‌ను కోరిన సంగ‌తి విదిత‌మే. అందుకు ఆయ‌న అంగీక‌రించ‌క‌ పోవ‌టంతో కాంగ్రెస్ శ్రేణులు జీఎమ్ కార్యా ల‌యం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టాయి. ఆ సంద‌ర్భంగా పోలీసులు పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. అనంత‌రం బ‌స్సుల‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా పార్టీ నాయ‌కుల‌ను ఢిల్లీకి త‌ర‌లించారు. అయితే మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు ఈ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టిన‌ట్టు టీపీసీసీ తేల్చింది. ఇందులో వ్య‌క్తిగ‌త, కుటుంబ ప‌నుల వ‌ల్ల న‌లుగురు ముంద‌స్తు అనుమ‌తి తీసుకున్నార‌ని స‌మాచారం. మిగ‌తా తొమ్మిది మంది సంగ‌తేట‌ని ఏఐసీసీ ప్ర‌శ్నించింది. వారు డుమ్మా కొట్ట‌టం వెనుకున్న కార‌ణాల‌ను తెలుపుతూ స‌మ‌గ్ర నివేదిక‌ను రూపొందించాలంటూ ఆదేశించింది. దీంతో సీఎం, పీసీసీ చీఫ్ ఆ నివేదిక‌ను రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా ఢిల్లీకి డుమ్మా కొట్టిన వారిలో మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, శ్రీధ‌ర్‌బాబు కూడా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్