Magazines

ఏఐకేఎస్‌ ఎయిర్‌ బెలూన్ల ఎగురవేత

2 గంటల క్రితం

AIKS
avatar
balaji

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జాతీయ మహాసభలు

15న బహిరంగసభకు తరలిరండి : జూలకంటి రంగారెడ్డి, కె.రామకృష్ణ


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగబోయే అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఏఐకేఎస్‌)36‌వ జాతీయ మహాసభల జయ ప్రదాన్ని కాంక్షిస్తూ శనివారం హైదరాబాద్‌‌ లోని బాగ్‌‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐకేఎస్‌ ‌ఎయిర్‌‌బెలూన్ల ను గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం కమిటీ చైర్మెన్‌ ‌జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ నల్లగొండలో తొలిసారి ఏఐకేఎస్‌ ‌జాతీయ మహాసభలు జరగబోతుం డటం గర్వకారణమన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు, రైతులందరూ మహాసభ లు జయప్రదం కావాలని ముందుకు రావడం, ఆదరించడం గొప్ప విషయమన్నా రు. ఇప్పటికే 1,50,000 కుటుంబాలను కలిశామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమకు తోచినంత ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నా రని చెప్పారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నా మనీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే రైతు సంఘం లాంటి సంఘాలు ముందుండి పోరాడాలని ప్రతి ఒక్కరూ అంటున్నారనీ, పార్టీలకు అతీతంగా బహిరంగ సభకు వస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని చెప్పారు. 15న నల్లగొండలో మహారైతు ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందనీ, దానికి మాజీ ఎంపీ బృందాకరత్‌, అశోక్‌‌దావలే, విజ్జుకృష్ణన్‌ ‌హాజరవుతారని తెలిపారు. మహాసభలను జయపద్రం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం జాతీయ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన నడిగడ్డ నల్లగొం డలో ఏఐకేఎస్‌ ‌మహాసభలు జరగడం గొప్ప విషయమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ అన్నదాతలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నదని విమర్శించారు. ఢిల్లీలో గొప్ప రైతాంగ పోరాటం చేసినా మోడీ సర్కారు మొండిగా ముందుకెళ్తున్నదని విమ ర్శించారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ పోరాటాలకు ఏఐకేఎస్‌ ‌మహాసభలు దిక్సూచిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం కమిటీ చైర్మెన్‌ ‌జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, కోశాధికారి మూడ్‌ ‌శోభన్‌, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి ఉడత రవీందర్‌, లెల్లెల బాలకృష్ణ, ప్రజాసంఘాల నాయకులు పాలడుగు భాస్కర్‌, ఎమ్‌‌డీ అబ్బాస్‌, జి.రాములు, ఆశయ్య, అరుణజ్యోతి, ఆర్‌.వెంకట్రాములు, శ్రీరాంనాయక్‌, ధర్మానాయక్‌, బి.పద్మ, శ్రీకాంత్‌, కిరణ్‌, సుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్