Magazines

‘మనీమ’ చిత్రానికి డిప్యూటీ సీఎం భట్టి క్లాప్

17 నిమిషాల క్రితం

Deputy CM Bhatti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

పూరి జగన్నాథ్ ఆలయ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం..

‎‎వందేమాతరం శ్రీనివాస్ తనయుడు తరంగ్ కీలక పాత్ర

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌‎

‎పూరి జగన్నాథ్ దేవాలయం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ‘మనీమ’ సినిమా షూటింగ్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ముహూర్తపు క్లాప్ కొట్టి చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ‎‎ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తనయుడు తరంగ్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు నవీన్ నల్ల దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, అమరేష్ చంద్ర సారంగి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

‎ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘మనీమ’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ‎‎చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన భట్టి విక్రమార్కకు దర్శకుడు నవీన్ నల్ల, నిర్మాత అమరేష్ చంద్ర సారంగి లు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటిస్తున్న పృథ్వీ, విష్ణు, సేన్ గుప్తా, కబీర్ దుహన్ సింగ్, బాబీ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్