Magazines

బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరగలేదా?

3 రోజుల క్రితం

corruption
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

అయితే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు ఆరోపణలు గుప్పించారు?

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌‌కుమార్‌‌కు 
టీఆర్ఎస్ నాయకుల సూటి ప్రశ్న

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదా? అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతే జరగలేదన్నట్టు మాట్లాడుతున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రూ.ఒక లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎందుకు ఆరోపణలు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి జరగలేదంటున్నారా లేక అవినీతి జరిగినా దానిని కవిత బయటపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నది బీఆర్ఎస్ నేతలే తప్ప కవిత కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మనోజ్ గౌడ్, నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ ఎం.ఏ.అశ్వక్ వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలతో కలిసి ఆయన ఆదివారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్క రూపాయి వ్యాపారం చేయకుండానే మూతపడిన కంపెనీ గురించి స్పష్టతనిచ్చినా సరే... ఆర్ఎస్పీ ఉద్దేశపూర్వకంగా కవితకు, రేవంత్ రెడ్డికి వ్యాపార సంబంధాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్