మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్:
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథను ప్రతి ఒక్కరు చదవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదల అయిందని ఆయన తెలిపారు సోనియా గాంధీ పుస్తకంలో ఎన్నో బాధాకరమైన వాస్తవాలున్నాయని చెప్పారు. పుస్తకంలో తన జీవితంలోని అనుభవాలను సోనియా ఆ పుస్తకంలో వెల్లడించారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.విదేశాల్లో పుట్టినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించిన ఆదర్శ మహిళ సోనియా అని కొనియాడారు. దేశ రాజకీయాలను ఆకళింపు చేసుకుని పార్టీని నడిపిస్తున్న నాయకురాలనీ, 2004లో ప్రధాని పదవిని త్యజించిన ఘనత సోనియా గాంధీదేనని తెలిపారు. మన్మోహన్ సింగ్ను ప్రధానిగా ఎంపిక చేసిన ఘనత సోనియా గాంధీదనీ, త్యాగధనుల కుటుంబానికి కోడలిగా సోనియా గాంధీ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. తన జీవితంలోని విషాదాలను పుస్తకంలో సోనియా వివరించారని చెప్పారు. సోనియా పుస్తకంపై రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
సోనియా గాంధీ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)