Magazines

కాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో పండుగల రద్దీ

1 గంట క్రితం

Festival rush at Kazipet and Warangal railway stations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దక్షిణ మధ్య రైల్వే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల అదనపు రద్దీని నిర్వహిం చడానికి సురక్షితమైన, సులభమైన, అవాంతరాలు లేని రైలు ప్రయాణాలు సాగేందుకు విస్తృత మైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏర్పాట్లలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రాంతాల నుంచి దేశం లోని వివిధ ప్రాంతాలకు ప్రయా ణించే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించనుంది. ఈ నెలలో కాజీ పేట, వరంగల్ స్టేషన్లలో సుమారు 150 ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే దానాపూర్, రక్సౌల్, దర్భంగా, ససారం, ప్రయాగ్రాజ్, సంత్రాగాచి, బరౌని, అగర్తలా, సిల్చార్ వంటి అనేక ముఖ్యమైన గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. అలాగే పెరిగిన ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడా నికి ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ఇతర గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. అంతే కాకుండా రైల్వే మౌలిక సదుపాయా లను మరింత బలోపేతం చేయడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొం దించే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే నిరంతరం కృషి చేస్తున్నది. ఇందు లో భాగంగా రైల్వే మార్గాల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ వంటి వివిధ సామర్థ్య విస్తరణ పనులను చేపడుతున్నది. ఈ పనుల ద్వారా రైల్వే సెక్షన్ల రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు, అదనపు రైళ్ల రాకపోకలకు అవసరమైన మార్గాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాబోయే కాలంలో మరిన్ని రైలు సర్వీసులను నడిపేందుకు అవకాశం కలుగుతుంది.

దక్షిణమధ్య రైల్వే పండుగ సీజన్‌లో స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికుల రాకపోకలు సజావు గా, క్రమబద్ధంగా సాగేందుకు, కాజీపేట, వరంగల్ స్టేషన్లలో ప్రయాణీకులకు సౌకర్యాలను పటిష్టం చేసింది. ప్రయాణికుల రాకపోకలతోపాటు రద్దీని నియం త్రించడానికి స్టేషన్లలో, సర్క్యు లేటింగ్ ప్రాంతాలలో తగిన సంఖ్యలో టికెట్ తనిఖీ సిబ్బందిని, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ నియమించ డమైనది. ప్రయాణికులకు మరింత సౌకర్య వంతమైన సేవలు అందిం చేందుకు, తగినన్ని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా జనరల్ టికెటింగ్ సదుపాయాలను కూడా బలోపేతం చేశారు. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను సులభంగా కొనుగోలు చేసేందుకు ,యూటీస్ మొబైల్ యాప్ వినియోగాన్ని ప్రోత్సహిస్తు న్నారు. యాప్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి, ప్రయాణి కులు క్యూలలో వేచి ఉండకుండా సౌకర్యవంతంగా టిక్కెట్లను కొను గోలు చేయడానికి వీలుగా, టిక్కెట్ కౌంటర్ల వద్ద, ఇతర ప్రముఖ ప్రదేశా లలో క్యూ ఆర్ కోడ్‌లను కూడా ప్రదర్శించారు. పండుగ సీజన్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ అవసరా లను తీర్చడానికి స్టేషన్లలో తగినంత తాగునీటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పండుగ సీజన్‌లో ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్య వంతమైన, అనుకూలమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలని ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్