Magazines

బోరబండలో దారుణం ..

52 నిమిషాల క్రితం

భార్యపై కోపంతో ఐదేండ్ల
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

భార్యపై కోపంతో కొడుకును చంపిన తండ్రి

నవతెలంగాణ-జూబ్లీహిల్స్

భార్యపై కోపంతో ఐదేండ్ల కుమారుడిని సవతి తండ్రి గొంతు నులిపి చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్‌-3 వికర్‌ సెక్షన్‌ శిల్పినగర్‌లో విద్యాసాగర్‌- దుర్గ దంపతులు తమ కుమారుడు విజయ్‌(5)తో కలిసి నివసించేవారు. ఆదివారం రాత్రి దుర్గ క్యాటరింగ్‌ పనికి వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న భర్త అడ్డుపడ్డాడు. రాత్రి సమయంలో క్యాటరింగ్‌‌కు వెళ్లొద్దని హెచ్చరించాడు. అయినా ఆమె పనికి వెళ్లిపోవడంతో భర్త కోపంతో ఇంట్లోనే ఉన్న కుమారుడిని గొంతు నులిమి దారుణంగా కొట్టి చంపేశాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన దుర్గకు.. కుమారుడు విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బోరబండ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌ జోన్‌ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ రాఘవేంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్