Magazines

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే 
కాళోజీ కళాక్షేత్రం

58 నిమిషాల క్రితం

Kalakshetra
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

హన్మకొండ కలెక్టర్ కు
 సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ను ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం స్పందించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని సీఎం ఆదేశించారు. కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను చర్చించి ఖరారు చేయాలని కలెక్టరుకు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్