Magazines

పాషా, నరహరిల వర్థంతి సభను జయప్రదం చేయాలి

59 నిమిషాల క్రితం

John Wesley
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

​రాష్ట్రంలో కరవు నివారణా చర్యలు చేపట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్‌

జపాలలో 50 అడుగుల స్మారక స్థూపం ఏర్పాటు

​ప్రారంభోత్సవానికి రానున్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

నవతెలంగాణ-మంచాల

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జపాల గ్రామంలో త్వరలో జరిగే పాషా, నరహరి వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జపాల గ్రామంలో వారి స్మారకార్థం 50 అడుగుల భారీ స్మారక స్థూపం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఈ స్థూపాన్ని ప్రారంభిస్తామన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం లోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పేద ప్రజల హక్కుల కోసం భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి ప్రజల్ని చైతన్యం చేసి వారు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆ విప్లవ యోధుల స్ఫూర్తితో తమ పార్టీ భూ పోరాటాలను నిర్వహిస్తోందన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడు తోందన్నారు. నాడు మతోన్మాదుల పైన విరోచిత పోరాటం చేసిన పాషా, నరహరి గొప్ప వీరులని కొనియాడారు. వారు చేసే పోరాటాలను జీర్ణించు కోలేని మతోన్మాదులు వారిని హత్య చేశారని తెలిపారు. అయినప్పటికీ వారు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. వారి పోరాటాలకు గుర్తుగా స్థూపాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఈ స్థూపం ఆవిష్కరణ సభకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ హాజరు అవుతున్నారని తెలిపారు. త్వరలోనే సభ తేదీని వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా మర్చి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరువు సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నీరు అందక అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలను సర్వే చేసి రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిం చే రేషన్ షాపుల్లో ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం తోపాటు 14 రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.సామెల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగల్ల భాస్కర్, ఎం.చంద్రమోహన్, డి.జగదీష్, జి.కవిత, ఇ.నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఏ.నరసింహ, రాజు, రావుల జంగయ్య, సి.ఎచ్.బుగ్గరాములు, సి.ఎచ్.జంగయ్య, ఎన్. శ్యామ్ సుందర్, జగన్ పోల్కంపల్లి, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్