నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల
మీదుగా ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు అందించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాల్లోని అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. కొడంగల్‌లో జరిగే కార్యక్రమంలో ఎంపిక చేసిన పలువురు నూతన లబ్ధిదారులకు సీఎం పింఛన్ల మంజూరు పత్రాలను అందజేస్తారు.
అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ నవంబర్ నెల నుంచే పింఛను మొత్తాన్ని అందించనున్నారు.
కొత్తగా మంజూరైన పింఛన్ల వివరాలు...
క్ర.సం | కేటగిరీ | సంఖ్య |
1). | వితంతువులు, ఒంటరి మహిళలకు | 3 లక్షలు |
2). | వికలాంగులు | 1 లక్ష |
3). | కల్లు గీత, చేనేత కార్మికులు | 50 వేలు |
మొత్తం | 4.50 లక్షలు |







కామెంట్‌లు (0)