Magazines

బిల్డర్ల అక్రమాలపై రెరా దూకుడు

12 నిమిషాల క్రితం

RERA's
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పొందిన అనుమతులను బేఖాతర్‌ ‌చేస్తూ నిబంధనలు ఉల్లఘిస్తున్న బిల్డర్లపై రెరా దూకుడు పెంచింది. కొనుగోలుదారులను మోసం చేస్తున్న కన్‌‌స్ట్రక్షన్‌‌కంపెనీలపై జరినామాలు వేస్తున్నది. వీటన్నింటిపై బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ అథారిటీ (రేరా) విచారణ చేపట్టి ఆయా కంపెనీలపై జరినామాలు విధిస్తూ తీర్పు చెప్పింది.

అందులో ఈ కింది కంపెనీలు ఉన్నాయి

ఎలైట్ బీహెచ్‌ఈఎల్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి చెందిన 38 మంది సభ్యులకు కేటాయించిన ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయాలని మాగ్నస్ ఎలైట్ హోమ్స్ ను రేరా ఆదేశించింది.

శ్రీ టవర్‌‌లో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కల్పిస్తామని ప్లాటు అమ్మింది. ఫిర్యాదుదారులకు సెల్లార్‌లో రెండు కార్ పార్కింగ్ స్థలాలను ఇవ్వాలని ఆదేశించింది.

జస్విత ఎస్టేట్స్ కొనుగోలుదారు నుంచి డబ్బులు వసూలు చేసినా ప్లాట్ నంబర్ 86ను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతోపాటు, నగదు వాపసు కోసం కంపెనీ ఇచ్చిన చెక్కులు తిరస్కరణకు గురయ్యాయి. అందుకు రూ.47 లక్షల వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

సిగ్నేచర్ టవర్స్ ప్రాజెక్టులోకొనుగోలుదారు వ్యక్తిగత కారణాలతో, ప్రాజెక్టు పూర్తయ్యే గడువుకు ముందే బుకింగ్‌రద్దు చేసుకున్నందున వడ్డీ మంజూరు చేయలేదు.

రూ.9 లక్షలను తిరిగి చెల్లించాలని ఆశ్రితాస్ గ్రూప్‌ను రెరా ఆదేశించింది.

గూగీ శాటిలైట్ టౌన్‌షిప్ ప్రాజెక్టులో కొనుగోలుదారులకు మిగిలిన రూ.18.80 లక్షలు వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఎస్‌వీ ఎలక్ట్రానిక్ సిటీ-3 ప్రాజెక్టులో ప్లాట్ నంబర్ 91 కొనుగోలుదారుకు రూ.6.10 లక్షలను ఏడాదికి 10.85 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు రేరా ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్‌వీ గోల్డెన్ సిటీ-వీ 212 చ.గ ప్లాట్ నంబర్ 97కు తుది లేఅవుట్ అనుమతిపొంది, తనఖా తొలగించి కొనుగోలుదారు పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ను ఆదేశించింది.

రాకెట్రీ విల్లా ప్రాజెక్టు రెరాలో నమోదు లేకుండా విక్రయాలు చేపట్టవద్దని హెచ్చరించింది.

కపిల్ బిజినెస్ పార్క్ లో వాణిజ్య యూనిట్ కొనుగోలుదారుకు రూ.24,64,259 ను తిరిగి చెల్లించాలంటూ కౌసల్య ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థలను ఆదేశించింది.

రాయన్ ఎన్‌క్లేవ్ ప్రాజెక్టులో ప్లాట్ బుకింగ్ కోసం వసూలు చేసిన రూ. లక్షను తిరిగి చెల్లించాలని నెస్ట్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు హుకుం జారీ చేసింది.

గుర్రాలపాడు ప్లాట్ల లేఅవుట్‌‌ రేరాలో నమోదు లేకుండా ప్లాట్ల విక్రయాలు చేపట్టిన బానోత్ సరోజిని, బానోత్ జానకిలకు రూ.57,735 జరిమానా విధించింది.

సుధీష డింపుల్ వ్యాలీ ప్రాజెక్టులో కొనుగోలుదారుకు రూ.10 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని, రూ.8,24,585 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఆర్‌డీబీ కోకోనట్ గ్రోవ్ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ లోపాలను సరిదిద్దడం, మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం, రెరా నమోదు వంటి అంశాలపై గత ఆదేశాలను అమలు చేయని ఆర్‌డీబీ హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై జూన్ 2 నుంచి రోజుకు రూ.1,000 జరిమానా విధించింది.

హనర్ అక్వాంటిస్ ప్రాజెక్టులో ఒకే కార్ పార్కింగ్ స్థలాన్ని ఇద్దరు ఫ్లాట్ యజమానులకు కేటాయించడంపై సీరియస్‌ అయింది.

కపిల్ బిజినెస్ పార్క్‌‌లో రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఒప్పందం కింద నెలవారీ చెల్లింపుల వివాదం రెరా పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

పారిజాత హోమ్స్ ప్లాట్‌కు సంబంధించి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా యాజమాన్య హక్కులు కలిగి ఉంటూనే కొనుగోలు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడం సమర్థనీయం కాదని తేల్చింది.

అయ్యప్ప శ్రీ రస్తు ప్రాజెక్టులో సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీ వ్యవస్థ, జనరేటర్ బ్యాకప్ వంటి మౌలిక సదుపాయాల్లో లోపాలను రెరా గుర్తించింది. ఆక్యు పెన్సీ సర్టిఫికెట్ పొందినప్పటికీ హామీ ఇచ్చిన సౌక ర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్